ఆశ్రమం శ్రీసచ్చిదానందేంద్రసరస్వతి స్వామివారి సంకల్పంతో 1964 లో శ్రీవారి సాక్షాత్ శిష్యులు కీ.శే.వే||బ్ర|| శ్రీ లక్ష్మీకాంతశర్మ గారిచే స్థాపించబడినది. ఇక్కడ ప్రతి రోజు ఉదయం శ్రీరామమందిరంలోనూ శ్రీశంకరాచార్యుల మందిరంలోనూ నిత్యపూజ జరుగుతూ సాయంత్రం 6:30 నుండి 8 వరకు ఆశ్రమ నిర్వాహకులచే వేదాంతసత్సంగం గత 5-6 దశాబ్దాలుగా జరుగుతున్నది. శ్రీస్వామివారి జయంతి మరియు ఆరాధన వంటి విశేష సందర్భాల్లో విశేషసత్సంగాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రతి నెలా రెండవ శనివారం ఆదివారం కలిసి వచ్చేటట్లు మూడు రోజుల మాసిక విశేష వేదాంత సత్సంగం జరపాలని సంకల్పించాము. జిజ్ఞాసువులు కనీసం 25 మంది హాజరు కాగలిగితే మాత్రమే జరుగుతుంది. వివరాలకు క్రింది ఫోన్ ను సంప్రదించండి.
ఆశ్రమంలో ఆధ్యాత్మగ్రంథమాల మరియు ఆధ్యాత్మజ్యోతి త్రైమాసిక పత్రికల ప్రచురణ, గోసేవ, నిత్యపూజ మరియు వేదాంత సత్సంగం నిరంతరాయంగా జరుగుతున్నాయి.