- పరిశుద్ధమైన శాంకరసాహిత్యమును ప్రచురించటంలో భాగంగా శ్రీసచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి గ్రంథాలకు తెలుగు అనువాదాలు మరియు శ్రీ పారాయణం లక్ష్మీకాంతశర్మ గారి స్వతంత్ర రచనలు మొత్తం కలిపి 90 కి పైగా ఉన్నాయి. కొన్ని ఇప్పటికే ప్రచురించబడి సిద్ధంగా ఉన్నాయి. వీటితో బాటుగా అధ్యాత్మజ్యోతి పత్రికలలో గత 40 సంవత్సరాలుగా ప్రచురితమైన వివిధ వ్యాసాలు ఉన్నాయి. వీటి నన్నింటిని స్వతంత్ర పుస్తకాలుగా రూపొందించాలనే సంకల్పమున్నది.
జిజ్ఞాసువుల సహకారంతోనే ఈ మహత్కార్యం జరగాల్సి ఉండటం వల్ల వీటిని క్రమంగా ముద్రించి ప్రచురించగలము.
ప్రస్తుతం పురాణరహాస్యాలు, అనుభవ పర్యంతమైన ఆత్మవిచారం గ్రంథాలను ముద్రించాలనుకొన్నాము. వేదాంత జిజ్ఞాసువుల మరియు ఆశ్రమ భక్తుల సహకారం వల్లనే ఈ కార్యమంతా రూపు దాల్చవలసి ఉన్నది.
- సహకరించగలగిన భక్తుల ఫోటోను పుస్తకంలో ప్రచురించగలము. ఆ యా పుస్తకాల ముద్రణకు ఎంత ఖర్చవుతుంది అనే సమాచారాన్ని ఆశ్రమం ఫోన్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.
ఆశ్రమం ఫోన్ నం.9490 477 602